గుండెపోటుతో దర్శకుడు ఎఎస్ రవికుమార్ మృతి

గుండెపోటుతో దర్శకుడు ఎఎస్ రవికుమార్ మృతి

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు ప్ర‌ముఖులు గుండెపోటుతో క‌న్నుమూస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. తాజాగా బాలకృష్ణతో పాటు యువ హీరోలు నితిన్, సాయి దుర్గా తేజ్, రాజ్ తరుణ్ వంటి హీరోల‌తో సినిమాలు చేసిన దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి క‌న్నుమూసారు. గత రాత్రి (జూన్ 10వ తేదీ) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సింది ఉంది. ఎఎస్ ర‌వి కుమార్ చివ‌రిగా రాజ్ తరుణ్‌తో తిరగబడరా స్వామి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చారు. ఎఎస్ ర‌వి కుమార్ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నట్టు తెలుస్తోంది. ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచిన‌ట్లు చెబుతున్నారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

editor

Related Articles