దిల్ రాజ్ చేతికి వార్ 2 రైట్స్.!

దిల్ రాజ్ చేతికి వార్ 2 రైట్స్.!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ సినిమా ‘వార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతోంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా.. ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 14న విడుద‌ల కానుండగా.. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇదిలావుంటే ఈ సినిమా తెలుగు హ‌క్కుల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమాపై ఉన్న బ‌జ్ కార‌ణంగా.. ‘వార్ 2’ తెలుగు వెర్షన్ కోసం భారీ ఆఫర్లు వ‌చ్చాయి. ఒక టైంలో అయితే రూ.120 కోట్ల వ‌ర‌కు ఈ సినిమా రైట్స్ పలికినట్లు స‌మాచారం. కానీ ఈ లోపే త‌మిళం నుంచి ర‌జ‌నీకాంత్ కూలీ కూడా ఆగ‌స్టు 14నే వ‌స్తుండ‌టంతో ఆలోచ‌న‌లో ప‌డ్డారు మేక‌ర్స్. దీంతో తాజాగా ఈ సినిమా హ‌క్కుల‌ను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకి అమ్ముతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

editor

Related Articles