ఇటీవలే ‘కుబేర’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు ధనుష్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆయన కెరీర్‌లో 54వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు D54 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు పోర్ తొళిల్ అనే థ్రిల్లర్‌తో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి గణేష్ ఈ సినిమాను నిర్మించబోతుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పత్తిపంట కాలిపోతుండగా ధనుష్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక భయంకరమైన మంటలు అలుముకుని ఉన్నాయి. ఈ దృశ్యం సినిమా కథాంశంపై, దాని థీమ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది చాలా ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథతో రాబోతోందని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి ప్రముఖ నటులు ఇందులో నటించబోతున్నారు. ఈ సినిమాను డా. ఇషారి కె.గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
- July 10, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor

