తెలుగు, తమిళ్ ఇంకా హిందీ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కోలీవుడ్ హీరో ధనుష్ అనే చెప్పొచ్చు. రీసెంట్ గానే తాను తెలుగులో చేసిన కుబేర సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ములతో చేసిన ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు ధనుష్ లైనప్‌లో ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా మరో సాలిడ్ దర్శకుడు తన లైనప్‌లో కన్ఫర్మ్ అయ్యాడు. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు కార్తీతో ‘ఖాకీ’, అజిత్‌తో భారీ యాక్షన్ సినిమాలు వలిమై, తెగింపు, ఇప్పుడు దళపతి విజయ్‌తో జన నాయకుడు లాంటి సినిమాలు చేస్తున్న దర్శకుడు హెచ్ వినోద్. తాను ధనుష్‌కి రీసెంట్ గానే కథ చెప్పగా ధనుష్ దాన్ని ఓకే చేసాడట. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తారని తెలిసింది. ఈ సినిమా విజయ్‌తో ‘జన నాయకుడు’ కంప్లీట్ అయిన వెంటనే మొదలవుతుంది అని తెలుస్తోంది.
- July 8, 2025
0
126
Less than a minute
Tags:
You can share this post!
editor

