నా కెరియర్‌లో 4వ జాతీయ అవార్డును పొందినందుకు తృప్తిగా…

నా కెరియర్‌లో 4వ జాతీయ అవార్డును పొందినందుకు తృప్తిగా…

జాతీయ అవార్డును గెలుచుకోవడంపై నీనా గుప్తా: “నా కెరియర్‌లో నాలుగవ జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు అది నాకు చెప్పలేని ఆనందాన్ని, గౌరవంగా భావిస్తున్నాను..” నీనా గుప్తా లాస్ట్ మూవీ కాగజ్ 2లో కనిపించింది. మంగళవారం జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో నీనా గుప్తాను సన్మానించారు. సూరజ్ బర్జాత్యా ఉంఛైలో తన పాత్రకు ఈ నటి ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమానికి నీనా గులాబీ రంగు చీర కట్టుకుని హాజరయ్యారు. ఆమె దానిని హాల్టర్-నెక్ పింక్ బ్లౌజ్‌తో జత చేసింది. నటి తన క్రాఫ్‌కు (జడకు)  సరిపోయే పువ్వులతో తన రూపాన్ని అందంగా అలంకరించుకుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ భారీ విజయంపై నీనా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈవెంట్ నుండి ఒక ఫొటోను షేర్ చేస్తూ, “గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నాకు లభించిన జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను” అని రాసింది. ఇది నా కెరియర్‌లో నాల్గవది. ఇది నాకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.

editor

Related Articles