దీపికా @8 పని గంటలు.. ఆమె కామెంట్స్ వైరల్..

దీపికా @8 పని గంటలు.. ఆమె కామెంట్స్ వైరల్..

ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్‌గా వైరల్ అయ్యిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దీపికా పదుకోణ్ అనే చెప్పాలి. పలు సినిమాల నుండి ఆమెని తొలగించడం ఆమె పెట్టిన కండిషన్స్ వైరల్‌గా మారాయి. అయితే అవి అప్పటికి టాక్ మాత్రమే కానీ అసలు దీనిపై ఆమె ఓపెన్ అయ్యి మళ్ళీ చేసిన పలు షాకింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీనితో ఆమె కేవలం 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటాను అని చెప్పింది నిజమే అని తెలిపింది. అయితే ఇండియన్ సినిమా దగ్గర ఎంతోమంది సూపర్ స్టార్ హీరోలు కూడా కేవలం 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తారు, వీకెండ్స్ షూటింగ్‌లో పాల్గొనరు ఈ విషయం ఎందుకు హెడ్‌లైన్స్లో పెట్టలేదు అనేది మాత్రం అర్ధం కాదని ఆమె తెలిపింది. అంతే కాకుండా ఇండియన్ సినిమాపై కూడా పలు సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మన ఇండస్ట్రీకి ఒక సిస్టమ్ లేదని దానిని ఒక పద్దతిలో పెట్టాలని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో తన నుండి వచ్చిన ఈ షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్‌ అయ్యాయి.

editor

Related Articles