యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ హీరో హీరోయిన్స్ సంతోష్ శోభన్, మానస వారణాసి విడుదల చేసిన వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, సంగీతం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా జంటల్ని థియేటర్లకు ఆకర్షించేలా ఉందని మేకర్స్ చెబుతున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్గా విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


