విడుద‌లకు ముందే ‘కూలీ’ రికార్డు

విడుద‌లకు ముందే ‘కూలీ’ రికార్డు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో గురువారం విడుదల కాబోతున్న భారీ సినిమా కూలీ. హీరో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, స‌త్య‌రాజ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ  సినిమా ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్ట్ 14 (గురువారం)నాడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ అంత‌టా మొద‌లైన విష‌యం తెలిసిందే. తాజాగా నార్త్ అమెరికాలో క్రేజీ రికార్డును అందుకుంది ఈ సినిమా. విడుద‌ల‌కు ఇంకా రెండు రోజులు ఉండ‌గానే ప్రీ బుకింగ్స్ సేల్స్‌తోనే రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డులకెక్కింది.

editor

Related Articles