తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘కూలీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే, రిలీజ్‌కు దగ్గరవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రజినీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. కూలీ సినిమాలో కూడా బ్లడ్ బాత్ ఖాయమని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేందుకు లోకేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాని ఆగస్ట్ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్, అమీర్‌ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

- August 2, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor