ముగింపు దశలో రజినీకాంత్ హీరోగా ‘కూలీ’

ముగింపు దశలో రజినీకాంత్ హీరోగా ‘కూలీ’

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా కూలీ (జైలర్‌ 2) రాబోతున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలను తీశారు. అన్నట్టు త్వరలోనే వైజాగ్, హైదరాబాద్‌లలో ఆఖరి షెడ్యూల్‌ జరగబోతోంది. ఇక మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమా తొలి గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో ఇది ముస్తాబవుతోంది. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

editor

Related Articles