సమంత ఇప్పుడు నిర్మాతగా మారి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ని స్థాపించింది. ఈ బ్యానర్‌పై ఆమె కొత్త వాళ్ళతో శుభమ్ అనే సినిమా చేస్తోంది. మే 9న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి సమంత జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సమంత రీసెంట్గా నెల్లూరులోని SV గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నిర్వహించిన ఒక ఈవెంట్లో పాల్గొంది. హీరోయిన్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నటన గురించి పెద్దగా తెలియదని, తాను నటించిన మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూస్తే సిగ్గుగా అనిపిస్తూ ఉంటుందని సమంత పేర్కొంది. ఆ సినిమాలలో సమంత అంత దారుణంగా ఉంటుందని, వాటిని చూసినప్పుడల్లా నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తే బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది అని సమంత స్పష్టం చేసింది. శుభమ్ చిత్రంలో అందరూ కొత్తవాళ్లే నటించారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళు కొత్త నటీనటులుగా ఏ మాత్రం అనిపించరు. అందరి మనస్సులని హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రవీణ్ కండ్రేగుల అనే నూతన దర్శకుడు శుభమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రీయా వంటి వారు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా కొత్తవారే. టాలెంట్ ఉన్న వారిని సమంత ప్రోత్సహిస్తుండడం గొప్ప విషయం. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అందుకే తాను నిర్మాతగా మారినట్టు సమంత పేర్కొంది.
- April 21, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

