వెంకటేష్-ఐశ్వర్యరాజేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’..

వెంకటేష్-ఐశ్వర్యరాజేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’..

హీరో వెంకటేష్ నటిస్తోన్న తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ Venky Anil 3గా రాబోతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫిమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ గోదారి గట్టు ప్రోమో ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో టైంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. ఈ సాంగ్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. రమణ గోగుల, మధు ప్రియ పాడిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేశాడు. ఈ పాట సినిమాకు హైలెట్‌ కాబోతోందని ఐశ్వర్యరాజేష్ – వెంకీ కాంబో లుక్స్‌ చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాలో వెంకటేష్ -మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చే ఓ పాటను డెహ్రాడూన్‌, ముస్సోరి, రిషికేష్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నట్టు తెలియజేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.

editor

Related Articles