హీరో చిరంజీవి సినిమా ప్రస్తుతం విశ్వంభర చిత్రీకరణ దశలో ఉంది. కాగా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం ఒక్క మీటింగ్‌లోనే స్క్రిప్ట్‌కు ఓకే చెప్పేశాడట చిరు. శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ విజన్‌కు ఇంప్రెస్ అయిన చిరంజీవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని చాలా ఫ్రెస్ లుక్‌తో చూపించబోతున్నాడట. చిరంజీవి అభిమానులను ఎంగేజ్ చేసేలా సర్‌ప్రైజింగ్ పాత్రను డిజైన్ చేశాడని ఇన్‌సైడ్ టాక్. ఇంతకీ ఈ ఇద్దరు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసిన దసరా డైరెక్టర్ మరి అభిమానులను ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

- December 2, 2024
0
26
Less than a minute
You can share this post!
editor