వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. 300 కోట్లకు పైగా వసూళ్లతో వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్‌కుమార్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా సాధించిన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని హిందీ రీమేక్‌లో నటించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. అయితే కొత్త దర్శకుడితో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

- February 25, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor