Movie Muzz

మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం

మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం

బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ విలువలను కళ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య  మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ ఆయన సతీమణి కొమురమ్మ పలుచోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివన్నారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన “బలగం” సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

editor

Related Articles