నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వెబ్ సిరీస్‌లు, ఇతర ప్రాజెక్టులతో అభిమానులని పలకరిస్తూ తెగ సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె “మా ఇంటి బంగారం” సినిమాతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తుండగా, ఆదిత్యరాయ్ కపూర్, వామికా గబ్బీ వంటివారు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ నిలిచిపోయిందని వచ్చిన పుకార్లపై దర్శకులు క్లారిటీ ఇచ్చారు.. షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతోంది అని స్పష్టం చేశారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా, సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫిట్నెస్, ఫ్రెండ్‌షిప్స్, వ్యక్తిగత జీవితం వంటి విషయాల్లో అభిమానులతో తెగ మమేకమవుతున్నారు. ఇటీవల కీర్తి సురేష్‌తో కలిసి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ముంబైలో ఫొటోగ్రాఫర్స్ వలన సమంత అసౌకర్యానికి గురి కాగా, అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఇదిలా ఉంటే సమంత – రాజ్ నిడిమోరు జంట గత కొంతకాలంగా ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లో కలిసి హాజరవడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత చేసిన పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ఫొటోలో సమంత భుజంపై అతను చేయివేసి నడుస్తుండగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. వీరిద్దరినీ ఇలాచూసిన నెటిజన్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
- July 9, 2025
0
54
Less than a minute
Tags:
You can share this post!
editor

