మమితా ఖాతాలో భారీ ప్రాజెక్టులు

మమితా ఖాతాలో భారీ ప్రాజెక్టులు

చెన్నై: మలయాళ సినిమా ‘ప్రేమలు’తో దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మమితా బైజు వరుస అవకాశాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలతో కలిసి నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన ‘జననాయగన్’ సినిమాలో మమితా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కుటుంబ కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని ఆగస్ట్ 14న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక మలయాళంలో నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బెత్లెహం కుటుంబ యూనిట్’ సినిమాలోనూ మమితా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 21న విడుదల కానుంది. ఇందులో మమితా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఒకేసారి మూడు భాషల్లో, ప్రముఖ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ మమితా బైజు దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.

Related Articles