టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితుడు, ప్రముఖ నటుడు వెంకటేష్‌కు (వెంకీ మామ) X వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహం, అప్యాయతను తెలియజేస్తూ, ‘‘నా ప్రియమైన వెంకీ మామకు ఎన్నో సంతోషకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెక్కడికి వెళ్లినా ఆప్యాయత, సానుకూలత పంచుతావు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.అలాగే, వెంకటేష్‌కు రాబోయే సంవత్సరం ఆనందంగా, సంతోషంగా, శుభప్రదంగా ఉండాలని, దైవ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో పెద్ద ఎమోషన్ క్రియేట్ చేసింది.
చిరంజీవి మరియు వెంకీ మామ మధ్య ఉన్న స్నేహానికి ఈ హృదయపూర్వక విష్ మరోసారి సాక్ష్యం అయ్యింది.


