‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరోయిన్ నయనతారకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ విషయంలో నయన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ తమిళ స్టార్ ధనుష్ రూ.10 కోట్లకు దావా వేశారు. తాజాగా ‘చంద్రముఖి’ నిర్మాతలు కూడా నయన్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. చంద్రముఖి చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడుకున్నారంటూ చిత్ర నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు నయన్‌కు నోటీసులు జారీ చేశారు. రూ.5 కోట్లు పరిహారం కింద చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. ఈ నోటీసులపై నయన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
- January 6, 2025
0
176
Less than a minute
Tags:
You can share this post!
administrator

