ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్‌కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ‘సల్లంగుండాలేకి’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని తన ఇల్లు, గ్రామాన్ని విడిచి వెళ్ళాల్సిన బాధతో ఉంటోంది. తండ్రి ఆమెను ఓదార్చుతాడు. పాటలో కుటుంబం, గ్రామం, వివాహ వేడుకలను అద్భుతంగా చూపించారు. ప్రతి కుటుంబ సభ్యుడు బహుమతుల గురించి మాట్లాడుతూ సాంప్రదాయ వేడుక భావాన్ని అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు మ్యాజిక్ క్రియేట్ చేసింది.
- December 11, 2025
0
4
Less than a minute
You can share this post!
editor


