తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కు పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్, దేశంలో తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫారమ్‌లో 2 నిమిషాల్లోపే ముగిసే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ఓటిటిలు లేని సమయంలో శరత్ అనురాగ్‌తో తన ప్రయాణం ఎలా మొదలైందో గుర్తుచేసుకున్నారు. వీరి కల్చర్, క్రియేటివ్ పర్స్పెక్టివ్ అద్భుతమని, టీవీ షోలు, స్టేజ్ ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్ వరకు ఎన్నో పనులు కలిసి చేశామని తెలిపారు. చాయ్ షాట్స్ కంటెంట్ క్రియేటర్ల చేతిలో భారీ శక్తి అని, ఇప్పటివరకు 200 మంది క్రియేటర్లకు ఇది ఎంపవర్ చేశామని చెప్పారు. యంగ్ ఆడియన్స్‌పై వీరి అర్థం అద్భుతమని, ఈ జర్నీలో భాగం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. కంటెంట్ సినిమాల్లా పాపులర్ కావాలని ఆకాంక్షించారు.
- December 11, 2025
0
3
Less than a minute
You can share this post!
editor


