బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తన న్యూ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు భారీ శరీరంతో కనిపించిన ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఏకంగా 25 కేజీల బరువు తగ్గడం వెనక తన కఠినమైన ఆహార నియమాలే కారణమని బోనీ తెలిపారు. ఈ మార్పు చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇతను బోనీ కపూరేనా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆర్.మాధవన్ తరహాలోనే బోనీ కూడా జిమ్‌కు వెళ్లకుండా, శారీరక శ్రమ పడకుండా కేవలం డైట్‌తోనే బరువు తగ్గిన వారిలో ఒకరిగా నిలిచారు. మాధవన్ ఆ మధ్య మాట్లాడుతూ.. సరైన ఆహార నియమాలతో బరువు తగ్గొచ్చని చెప్పారు. ఇప్పుడు దానిని బోనీ చేసి చూపించారు. ఇక బోనీ కపూర్ డైట్ ప్లాన్ గురించి చెబుతూ.. ఉదయం అల్పాహారంలో పండ్లు, పండ్ల రసాలు, జవర్ రోటీ మాత్రమే తింటున్నాను. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో సలాడ్లు, సూప్‌లు వంటి తేలికపాటి ఆహారం తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారమే తింటున్నానన్నారు. కేవలం డెడికేషన్, ఆత్మనిబ్బరం మాత్రమే ఉన్నాయి అంటూ బోనీ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా సహజమైన మార్పు అని, దీనికోసం జిమ్‌కు వెళ్లనవసరం లేదని తెలిపారు.

- July 23, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor