టాలీవుడ్ నుండి వస్తున్న సినిమాలలో ‘విశ్వంభర’ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం టీజర్ విడుదల కాగా, టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్‌పై మరింత కష్టపడుతున్నారు మేకర్స్. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను హాలీవుడ్‌కి చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియోకి అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ హాలీవుడ్ స్టూడియో విశ్వంభర సినిమాకు సాలిడ్ ఔట్‌పుట్‌ని అందించనుందని సమాచారం. పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’ స్పెషల్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండగా, ఇప్పుడు ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నటి మౌని రాయ్ హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర, గోల్డ్ వంటి హిందీ సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ, ఇప్పుడు చిరుతో ఓ స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా హైదరాబాద్ వచ్చిన విషయం కన్ఫర్మ్ చేసిన మౌని, తన టీంతో కలిసి దిగిన ఫొటోలు కూడా షేర్ చేసింది. ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మూడు నుండి నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. మౌనీతో చిరు స్టెప్పులు ఏ రేంజ్‌లో ఉంటాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- July 25, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor