న్యూ రూల్స్‌తో బిగ్ బాస్ సీజ‌న్ 9 సెప్టెంబర్ నుండి..

న్యూ రూల్స్‌తో బిగ్ బాస్ సీజ‌న్ 9 సెప్టెంబర్ నుండి..

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న బిగ్ బాస్ 9 రియాలిటీ షో స‌క్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజ‌న్స్ పూర్తి చేసుకుని, 9వ సీజన్‌లోకి  మ‌రికొద్దిరోజుల‌లో అడుగుపెడుతుండ‌గా, ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టింది. ఇటీవ‌ల ప‌లు వీడియోలు విడుద‌ల చేసి షోపై ఆస‌క్తి పెంచే ప్ర‌య‌త్నం చేశారు. సెప్టెంబర్ 2025లో ఈ సీజన్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు. షోకి హోస్ట్‌గా కింగ్ నాగార్జునే ఉంటారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సీజన్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మైండ్ గేమ్స్, ఇంటెన్స్ డ్రామా అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. ఎలిమినేషన్ ప్రాసెస్‌కి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్  ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక పరిపక్వత వంటి అంశాలపై ఎక్కువగా ఆధారపడే టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా విడుద‌లైంది. సెల‌బ్రిటీల‌తో పాటు సామాన్యుల‌ని సైతం ఈసారి బిగ్ బాస్ షోలోకి తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 మునుపటి కంటే మెరుగ్గా ఉండేలా మేకర్స్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో రీతూ చౌదరి పేరు హైలెట్ అవుతోంది. నవ్య స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతిరాయ్‌లతో పాటు కల్పికా గణేష్, తేజస్విని గౌడ, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, సాయికిరణ్, దీపికా  మరికొందరు ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనే ఛాన్స్  ఉంది.

editor

Related Articles