అమెరికాలో డోస్ పెంచిన బిగ్‌బాస్ బ్యూటీ..

అమెరికాలో డోస్ పెంచిన బిగ్‌బాస్ బ్యూటీ..

తెలుగు టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కెర్రెక్కిస్తూ ఉంటుంది, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ బ్యూటీ ఇటీవల మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక, నటుడు శివకుమార్‌తో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలంగా వీరి ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి గాసిప్స్ తెగ హల్‌చల్ చేస్తున్నా, ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా స్పందించింది లేదు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో “వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కుతాం” అంటూ చెప్పడంతో అభిమానుల్లో కొంత ఉత్సాహం పెరిగింది. మౌనరాగం, జానకి కలగనలేదు లాంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, చల్తే చల్తే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని తన ఆటతీరు,  ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక. బిగ్‌బాస్ షో తర్వాత గ్లామర్ పరంగా మరింత బోల్డ్ అవతారంలోకి మారింది అందాల బ్యూటీ ప్రియాంక‌. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటో షూట్లతో తెగ హల్‌చల్ చేస్తోంది ఈ బ్యూటీ, తాజాగా అమెరికాలో శివకుమార్‌తో కలిసి విహరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో వీరి మధ్య కెమిస్ట్రీ స్పష్టంగా కనిపించడంతో, కొంతమంది నెటిజన్లు “నడి రోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటి?” అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

editor

Related Articles