బిగ్ బాస్ బ్యూటీ సీమంతం వేడుక‌..

బిగ్ బాస్ బ్యూటీ సీమంతం వేడుక‌..

సీరియ‌ల్స్‌, సినిమాల‌లో న‌టించి పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోని వారు బిగ్ బాస్ షోతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యారు. ఆ జాబితాలో సోనియా ఆకుల ముందు వరుసలో ఉంటుంది. ఆర్జీవీ తీసిన “కరోనా వైరస్” సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈమె పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. లా చదువుకున్న ఆమె, బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లాయర్‌గా చేసిన అనుభవంతో నామినేషన్ల స‌మ‌యంలో దూకుడుగా వాదిస్తూ ఆకట్టుకుంది. కానీ నిఖిల్, పృథ్వీతో ఆమె నడిపిన “పెద్దోడు-చిన్నోడు” ట్రాక్‌ను ప్రేక్షకులు సరిగ్గా స్వీకరించలేక‌పోయారు. ఫలితంగా ఆమె త‌క్కువ స‌మ‌యంలోనే హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఇటీవ‌ల గుడ్‌న్యూస్‌తో అభిమానులను ఉత్సాహపరిచింది సోనియా ఆకుల. తాను తల్లికాబోతున్న సంగతి భర్త యష్ వీరగోనికి సర్‌ప్రైజ్‌గా చెప్పిన ఆమె  ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీవీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భానుశ్రీ, అమ‌ర్‌దీప్‌ల‌తో పాటు ప‌లువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియ‌ల్ ఆర్టిస్ట్స్ కూడా వేడుక‌లో పాల్గొని సంద‌డి చేశారు.

editor

Related Articles