కార్తిక్ ఆర్యన్ ఇటీవల తన సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో బాక్సాఫీస్ ఘర్షణపై తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. కార్తీక్ ఆర్యన్ రాబోయే చిత్రం భూల్ భులయ్యా 3 నవంబర్ 1న దీపావళికి రిలీజ్ కానుంది. అత్యధికంగా ఇష్టపడే భూల్ భూలయ్య ఫ్రాంచైజీ మూడవ భాగానికి అభిమానులు ఎక్కువే ఉంటారని ఒక అంచనా, ట్రైలర్‌కు రికార్డ్ హిట్స్ వచ్చాయి. అయితే విడుదలైన అదేరోజున మరో భారీ బడ్జెట్ చిత్రం సింగం 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తిక్ ఆర్యన్ ఇటీవల తన సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఈ బాక్సాఫీస్ ఘర్షణపై తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. “ఇది రెండు చిత్రాల మధ్య వర్సెస్ కాదు; అవి ముఖ్యమైన ఫ్రాంచైజీలలో భాగం మాత్రమే, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. యే జో వర్సెస్ చాలు హువా హై, యే బహుత్ గలాత్ హై (ఈ విధమైన చర్చ మొదలైంది, ఇది తప్పుడు సంకేతాల్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెడుతుందని),” ఇలా మాట్లాడవద్దని అన్నారు.
అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భులయ్యా 3లో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ట్రిప్తీ డిమ్రీ, రాజ్‌పాల్ యాదవ్‌లతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. సింఘం ఎగైన్ కూడా బలమైన హిట్ సినిమా కేటగిరీలో సంచలనం కలిగి ఉంది, ఇందులో అజయ్ దేవగణ్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లు నటించారు.