కార్తీక్-విద్యాబాలన్ హౌరా బ్రిడ్జిపై భూల్ భూలయ్యా 3 ప్రమోషన్…

కార్తీక్-విద్యాబాలన్ హౌరా బ్రిడ్జిపై భూల్ భూలయ్యా 3 ప్రమోషన్…

హీరో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్‌పై భూల్ భూలయ్యా 3ని తమదైన  శైలిలో ప్రచారం చేశారు, వారి ఐకానిక్ పాత్రలతో ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచారు. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్‌పై భూల్ భూలయ్యా 3ని ప్రమోట్ చేశారు. ప్రమోషన్స్ సమయంలో విద్య మంజూలిక పాత్రలో మళ్లీ నటించింది. ఆమె కార్తీక్‌ మెడచుట్టూ చేతులతో పట్టుకుని ఉల్లాసంగా కనిపించింది, ఇది ఆమె పాత్ర మంజూలికకు చాలా ముఖ్యమైంది.

కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్యా 3 కోసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబై ప్రమోషన్‌లను ముగించిన తర్వాత, ప్రమోషన్‌ల చివరి దశ చేరువలో నటీనటులు కోల్‌కతా చేరుకున్నారు. అక్టోబర్ 28న, కార్తీక్, విద్య హౌరా బ్రిడ్జిపై కోల్‌కతాలోని ఐకానిక్ ఎల్లో టాక్సీపై నిలబడి తమ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించారు. కింద గుమికూడిన అభిమానులు ఆ టైమ్‌లో తమ ఫోన్‌లకు పనిచెప్పారు. ఫ్యాన్స్ వివిధ రకాల ఫొటోలను తీసి షేర్ చేశారు.

administrator

Related Articles