చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తాజా సినిమా ‘బైసన్’. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్ రజనీకాంత్ బైసన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్‌కు ఫోన్ చేసి అభినందించినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సూపర్ మారి సూపర్! బైసన్ చూశాను. సినిమా సినిమాకి మీ కృషి, మీ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. బైసన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ తలైవర్ ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపాడు. అయితే సూపర్‌స్టార్ ప్రశంసలకు ఉప్పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ తన స్పందనను ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సినిమా అక్టోబర్ 24న తెలుగులో విడుదల కానుంది. సూపర్‌స్టార్ నుండి వచ్చిన ఈ ప్రశంసలు ‘బైసన్’ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
- October 22, 2025
0
120
Less than a minute
You can share this post!
editor


