పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా “ఓజీ” (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) విడుదలకు ముందే భారీ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, తమ ఆరాధ్య నటుడి రాజకీయ పార్టీ జనసేనకు మద్దతు తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అభిమాన సంఘాలు ‘ఓజీ’ ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి, అందిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించారు. వివిధ ప్రాంతాల్లో వేలం ద్వారా సేకరించిన లక్షల రూపాయలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఫ్యాన్స్ అందజేశారు. ఈ క్రమంలో, బెంగళూరుకు చెందిన ఫ్యాన్స్ ఏకంగా రూ.3.61 లక్షల రూపాయలను విరాళంగా సేకరించారు. చెన్నై అభిమానులు రూ.1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు రూ. 1 లక్షను జనసేన ఖజానాకు అందించారు. అభిమానుల ఈ అంకితభావం, రాజకీయంగా కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. నిధులను స్వీకరించిన నాగబాబు, అభిమానుల నిబద్ధతను ప్రశంసిస్తూ, “పవన్ కళ్యాణ్‌పై అభిమానులకు ఉన్న అపారమైన మద్దతు ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద బలమవుతుంది” అని పేర్కొన్నారు.

- September 22, 2025
0
2
Less than a minute
Tags:
You can share this post!
editor