హీరో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఐతే, ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న డ్యూయెల్ రోల్‌లో.. ఒక పాత్ర నెగిటివ్, మరోపాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్‌లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఆల్‌రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

- February 10, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor