Movie Muzz

అసెంబ్లీలో బాలకృష్ణ సరదా వ్యాఖ్యతో సభికులను నవ్వులు పూయించారు..

అసెంబ్లీలో బాలకృష్ణ సరదా వ్యాఖ్యతో సభికులను నవ్వులు పూయించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా మంగళవారం టీడీపీ శాసనసభాపక్ష (టీడీఎల్పీ) కార్యాలయం ఓ సరదా క్షణానికి వేదికైంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన స‌ర‌దా కామెంట్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే, విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇదే సమయంలో తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి, “నన్ను ఆశీర్వదించండి అంకుల్” అని కోరారు. దీనికి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూ.. “నో అంకుల్… ఓన్లీ బాలయ్య!” అని నవ్వుతూ చెప్పడంతో, అక్కడున్న సభ్యులందరూ పగలబడి నవ్వారు. ఈ సరదా కామెంట్‌తో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

administrator

Related Articles