హీరో బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన దృష్ట్యా ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తనకు ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ కన్ఫర్మ్ చేశారు. ఓ జాతీయ వెబ్‌సైట్‌తో ముచ్చటించిన ఆయన.. తన తదుపరి సినిమాను బాలకృష్ణతో చేయబోతున్నానని వెల్లడించారు. బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10న ఈ సినిమా మొదలవుతుందని తెలిపారు. ఇటీవల ‘జాట్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. దీనికి సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాణ సంస్థ ఇటీవలే వెల్లడించింది. అయితే బాలకృష్ణతో సినిమా పూర్తిచేశాకే దర్శకుడు గోపీచంద్ ‘జాట్-2’ షూట్‌లోకి ఎంటరవుతారని తాజా సమాచారం.

- April 19, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor