1980లలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోలుగా, హీరోయిన్లుగా పాపులర్ అయిన స్టార్స్ ప్రతి ఏడాది ఒక గెట్ టుగెదర్ నిర్వహిస్తూ ఉంటారు. దీనికి 80 స్టార్స్ రీయూనియన్ అనే పేరు పెట్టారు. ఈసారి కూడా శనివారం చెన్నైలో ఈ ఈవెంట్ జరిగింది. అందులో తెలుగు నుండి చిరంజీవి, వెంకటేష్, నరేష్, రమ్యకృష్ణ, జయసుధ పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం మళ్లీ ఈసారి కూడా కనిపించలేదు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తొలిరోజుల్లో ఈ రీయూనియన్‌కి వెళుతుండేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన ఈ ఈవెంట్‌కి దూరంగా ఉంటున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
బాలయ్య ముక్కుసూటి మనిషి, మనసులో ఉన్నదే మాట్లాడతారు. అందుకే కొంతమంది ఇబ్బంది పడతారని వెళ్లడం లేదు అని కొందరు కామెంట్ పెడుతున్నారు. ఇంకొందరు ఇన్వైట్ చేసినా, చేయకపోయిన బాలయ్య వెళ్లరు, ఆయన రూటే సపరేటు అని అంటున్నారు. ఇటీవల బాలయ్య.. చిరంజీవిపై కొన్ని సంచలన కామెంట్స్ చేయడం వల్ల కూడా వెళ్లి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇష్యూపై బాలయ్య గతంలో ఏమన్నాడంటే .. “నాకు గౌరవం ఇస్తేనే గౌరవం ఇస్తాను. ఇన్‌వైట్ చేయకపోతే నేను పట్టించుకోను.
