హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ మొదటి రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన నేపథ్యంలో అవతార్ 3 కూడా తప్పక ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నారు. అవతార్: ఫైర్ అండ్ యాష్ టైటిల్‌తో మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా డిసెంబరు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అవతార్ 3 ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలని చాలా అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కొద్ది రోజుల క్రితం సినిమాలో విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న ‘వరంగ్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అగ్ని శక్తులతో కూడిన నెవీ గణానికి చెందిన వరంగ్ పాత్ర చాలా మిస్టీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు సినీ ప్రియులు భావించారు. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పార్ట్‌లో కొత్త విలన్లు తెరపైకి రానున్నారు.

- July 29, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor