టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్, అథియా శెట్టి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. తాజాగా పాప పేరును అథియా శెట్టిగా రివీల్ చేశారు. అథియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గత నెల 24న ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. తాజాగా పాప పేరును అథియా శెట్టి రివీల్ చేశారు. తమ కుమార్తెకు ‘ఎవారా విపుల రాహుల్’ అని నామకరణం చేశారు. పాప పేరును అథియా శెట్టి ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా ప్రకటించారు. ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ‘ఎవారా’ అంటే దేవుడిచ్చిన బహుమతి అని అర్థం అంట. ఇక విపుల తన నానమ్మ (అథియా శెట్టి నానమ్మ) గౌరవార్థం యాడ్ చేసినట్లు తెలిపారు. ఇక చివరిలో తండ్రి పేరు రాహుల్ అని అథియా తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఇవాళ కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అథియా శెట్టి తమ కుమార్తె పేరును రివీల్ చేశారు.

- April 18, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor