నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీమనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, యోగిబాబుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో తాను జడ్జి పాత్రలో నటించానని బ్రహ్మానందం తెలిపారు. ఈ సినిమా ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకురావడం ఆనందగా ఉందని, బ్రహ్మానందంతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చిందని యోగిబాబు అన్నారు. ఈ సినిమాలో తాను సౌదామిని పాత్రలో నటించానని, బ్రహ్మానందం, యోగిబాబు వంటి కామెడీ సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: కృష్ణసౌరభ్, నిర్మాతలు: వెను సద్ది, జయకాంత్.

- August 5, 2025
0
35
Less than a minute
Tags:
You can share this post!
editor