ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్‌లు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో పూరీ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈ ప్రముఖ దర్శకుడు తన తదుపరి సినిమాను తమిళ స్టార్ విజయ్ సేతుపతితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని జులై మొదటి వారంలో ప్రారంభించారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అయితే తాజాగా పూరీ జగన్నాథ్.. ప్రభాస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూరి, ఛార్మి కలిసి ఈ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “డార్లింగ్స్ ఫరెవర్” అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రభాస్‌ని ‘ది రాజాసాబ్’ సినిమా సెట్స్‌లో కలిసినట్లు పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో పూరీని ప్రభాస్ ప్రేమగా హగ్ చేసుకున్న దృశ్యం ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఈ సమావేశంతో అభిమానుల్లో కొత్త అంచనాలు మొదలయ్యాయి. “ఇన్ని రోజుల తర్వాత కలిశారు అంటే.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?” అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

- July 30, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor