‘బొమ్మాళీ’ కెరీర్ ముగిసినట్టేనా..?

‘బొమ్మాళీ’ కెరీర్ ముగిసినట్టేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలిగిపోయిన అనుష్క, ఇటీవల సినిమాల్లో తక్కువగా కనిపించడంతో ఆమె కెరీర్ ముగిసిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

దీంతో అనుష్కతో కొత్త ప్రాజెక్టులు చేయడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసిన అనుష్క, ప్రస్తుతం మాత్రం సినిమాల విషయంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన బరువు కూడా ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనుష్క చేతిలో ‘కతనార్’ అనే మలయాళ సినిమా మాత్రమే ఉంది. మరి ‘జెజమ్మ’గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క మళ్లీ పవర్‌ఫుల్ కంబ్యాక్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles