వార్-2 సినిమాలో మరో సర్‌ప్రైజ్ థ్రిల్..

వార్-2 సినిమాలో మరో సర్‌ప్రైజ్ థ్రిల్..

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో ప్రేక్షకులను స్టన్ చేసే అంశాలు చాలా ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్‌ను కూడా ఇవ్వనున్నారట మేకర్స్. వార్-2 సినిమా ఎండ్ టైటిల్స్ కార్డ్ పడ్డాక.. అలియా భట్, శార్వరి కలిసి నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమాకి సంబంధించిన ఓ సీక్వెన్స్ ఉండబోతోందని.. అది ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగానే ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశమని చెప్పాలి. వార్-2 క్లైమాక్స్ తర్వాత  ఏంటి.. అనే ప్రశ్నకు ‘ఆల్ఫా’ సీక్వెన్స్ సమాధానంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి వార్-2 శుభం కార్డు తర్వాత ఆల్ఫా ఆరంభం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

editor

Related Articles