రిషబ్ షెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండీ టీమ్‌ను అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మరణించారు. ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో ఆయన కుప్పకూలి చనిపోయారు. ఆయనకు గుండెకి సంబంధించిన చికిత్స ఈ మధ్యనే జరిగినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చికిత్స తర్వాత బాగానే ఉన్నా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూసారు. గత కొద్ది రోజులుగా కాంతార ఛాప్టర్ 1 సినిమాకి సంబంధించిన ఎవరో ఒకరు ఇలా కన్నుమూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండిస్తూ.. గాలి వాన వల్ల సెట్ కూలింది తప్ప ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని ఆయన తెలియజేశారు. గతంలో కూడా గాలి వాన వలన కాంతార టీమ్ వేసిన భారీ సెట్ కుప్పకూలింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు టీమ్‌ని టెన్షన్‌కి గురి చేస్తోంది. ఈ సినిమాకోసం హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నాడు, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాని అక్టోబర్ 2 విడుదల చేయబోతున్నారు.

- August 9, 2025
0
73
Less than a minute
Tags:
You can share this post!
editor