స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ.. మనకు మన హీరోలంటే అభిమానం. మీరు నన్ను అభిమానిస్తారు. నేను నాకు ఇష్టమైన హీరోను అభిమానిస్తాను. ఆ అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో డైరెక్టర్ నలన్ ‘అన్నగారు వస్తారు’ సినిమాను రూపొందించారు. కృతి చెప్పినట్లు 70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు ట్రిబ్యూట్ లా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథకు ఒక సూపర్ హీరో లాంటి హీరో కావాలి. సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ లా ఎందుకు ఉండాలి. మన కల్చర్ లోనే ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు. వాళ్లు సినిమాను రాజకీయాలను ప్రజా జీవితాలను మార్చేశారు. హీరో తెరపై ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. మనకు మన హీరోలే డెమీ గాడ్స్.
- December 10, 2025
0
9
Less than a minute
You can share this post!
editor


