రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్”గా దూసుకొస్తున్నాడు!

రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్”గా దూసుకొస్తున్నాడు!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ఫస్ట్ డే ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్‌కి పర్‌ఫెక్ట్ వుండే ఈ సాంగ్ నవంబర్ 12న విడుదల కానుంది. రామ్ సెలబ్రేషన్స్ మోడ్‌లో వున్న సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్‌ – మర్విన్‌ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.

editor

Related Articles