‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి సినిమా ఎప్పుడూ రాలేదు.!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి సినిమా ఎప్పుడూ రాలేదు.!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.   హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్  పెట్టడానికి కారణం ?
-ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  

editor

Related Articles