బుల్లితెరకు గ్లామర్ తీసుకొచ్చిన అతికొద్ది మందిలో అనసూయ ఒకరు కాగా, ఈమె జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేసి కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నటిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి సినిమాల్లో నటిగా మెప్పించిన అనసూయ స్పెషల్ సాంగ్స్, ఈవెంట్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది.. ఇటీవల టీవీ షోలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ వంటి షోలలో టీమ్ లీడర్‌గా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తనపై వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై స్పందించింది. ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తాను. ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటాను. నేను వాళ్లను ఇక భరించలేను అనుకున్నప్పుడు నా ప్రపంచం నుంచి తొలగించేస్తాను అని చెప్పుకొచ్చిన అనసూయ.

- July 28, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor