ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అసలైన పండుగ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. వరుసగా మూడు విజయాలతో స్టార్ ఎంటర్టైనర్గా నిలిచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. 2026 జనవరి 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే భారీ అంచనాలు పెంచింది. విడుదలకు ముందు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ‘ఆంధ్ర టు తెలంగాణ’ అనే మూడవ గీతాన్ని ఆవిష్కరించారు. చంద్రబోస్ సాహిత్యం, మిక్కీ జె మేయర్ సంగీతం, సమీరా భరద్వాజ్, ధనుంజయ్ సీపాన గానం ఈ పాటను ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో ఈ వేడుక ఉత్సాహంగా సాగింది.
- January 13, 2026
0
7
Less than a minute
You can share this post!
editor


