ఈ  ముగ్గురికీ  కలిసిరాని  రీ-ఎంట్రీ!

ఈ  ముగ్గురికీ  కలిసిరాని  రీ-ఎంట్రీ!

టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు చాలామంది  ప్రయత్నాలు చేశారు. కొందరికి రీ-ఎంట్రీలో సాలిడ్ హిట్ పడుతుంది. కానీ, మరికొందరికి ఈ రీ-ఎంట్రీ కలిసిరాలేదు. ఇటీవల టాలీవుడ్‌లో ముగ్గురు హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఏ ఒక్కరికీ కూడా సాలిడ్ కమ్ బ్యాక్ మాత్రం రాలేదు. మన్మధుడు, రాఘవేంద్ర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అన్షు ఇటీవల ‘మజాకా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఇక నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమాతో నటి లయ కూడా తన రీ-ఎంట్రీపై భారీ అంచనాలే పెట్టుకుంది. కానీ, ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది. మరో హీరోయిన్ జెనీలియా ‘జూనియర్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమెకు ఈ సినిమాతో అనుకున్న గుర్తింపు  రాలేదు. మొత్తానికి ఈ ముగ్గురు హీరోయిన్లు రీ-ఎంట్రీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూసినా, వారికి బ్యాడ్ లక్ ఎదురైంది. మరి ఈ మాజీ హీరోయిన్లు మున్ముందు కంటిన్యూ అవుతారా లేదా చూడాలి.

editor

Related Articles