సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరైనారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైనారు. బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్‌కు ఈ నెల 13న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. తొక్కిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిసన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యజమానులు ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
- December 27, 2024
0
147
Less than a minute
Tags:
You can share this post!
administrator


