అల్లు అర్జున్ – ‘పుష్ప ది రూల్’ ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్

అల్లు అర్జున్ – ‘పుష్ప ది రూల్’ ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్

దాదాపు రెండు నెలల్లోపునే పుష్ప రిలీజ్ కానుంది. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ఇప్ప‌టినుంచే ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ పని అయిపోయి లాక్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీష్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

editor

Related Articles