పుష్ప2 తర్వాత హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని చాలామంది అనుకున్నారు. కాని అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతోంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనే దానిపై ఇప్పటి నుండే చర్చ నడుస్తోంది. అట్లీతో సినిమా తర్వాత అయినాక త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేస్తాడేమో అన్న ఊహాగానాలకు బ్రేక్ వేసేలా, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే తర్వాత వచ్చే బిగ్ అనౌన్స్‌మెంట్‌పై బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గా బన్నీ వాసు త్రివిక్రమ్ సినిమా కాదు, ఊహించని కాంబినేషన్ అంటూ ట్వీట్ చేసాడు. దాంతో అభిమానుల్లో బన్నీ తర్వాత వచ్చే సినిమాపై ఉత్సుకత పెరిగిపోయింది. ఎవరా అని ఆరా తీస్తే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు వినిపిస్తోంది. ఆయనతోనే బన్నీ తర్వాత వచ్చే సినిమా అంటున్నారు. బాసిల్ జోసెఫ్ పేరు వినగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది ‘మిన్నల్ మురళీ’. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బాసిల్‌కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. అదే సమయంలో ‘జయ జయ జయ జయహే’ లాంటి సెటైరికల్ కామెడీ హిట్‌తో కూడా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
- June 13, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

